Mukhra K Farmers | ట్రాన్స్ఫార్మర్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి ముఖరా (కే) రైతుల పుష్పాభిషేకం
Mukhra K Farmers | కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందా అని చూసే రైతులు.. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని ముఖరా (కే) రైతులు అన్నారు.
Mukhra K Farmers | కేసీఆర్ సార్.. నువ్వు లేక మాకు 7 గంటల కరెంటే దిక్కయింది. ఆ 7 గంటల కరెంట్ కూడా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. లో-వోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోతున్నాయి. నువ్వు వస్తేనే త్రీఫేజ్ 24 గంటల కరెంట్ వస్తది.. అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్తులు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందేదని, పుష్కలంగా నీళ్లు వచ్చేవని.. రేవంత్ సర్కార్ వచ్చాక వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందడం లేదని అన్నారు. ప్రస్తుతం వచ్చే కరెంట్ కూడా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, లో-వోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు. కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందా అని చూసే రైతులు.. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
కేసీఆర్ ఉంటే రైతులకు భరోసా ఉండేదని, 24 గంటల కరెంట్ ఉండేదని, పొలాలకు నీళ్లు అందేవని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుభరోసా విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. వ్యవసాయ రంగానికి వెంటనే 24 గంటల త్రీఫేజ్ కరెంట్ అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని, మళ్లీ కేసీఆర్ వస్తేనే తమ బతుకులు మారుతాయని అన్నారు. కేసీఆర్ వస్తేనే రైతులకు 24 గంటల కరెంట్, పొలాలకు నీళ్లు వస్తాయని, కేసీఆర్ ఉంటేనే రైతులు రాజుగా బతుకుతారని పేర్కొన్నారు.
మళ్లీ నువ్వే రావాలి కేసీఆర్ సార్” అంటూ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, దత్త, ప్రహ్లాద, నాగనాథ్, తులసీరాం, రాంకిషన్, మారుతి తదితరులు, రైతులు పాల్గొన్నారు.

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rizwan Basha Shaik | సీఎంఆర్ బియ్యం అప్పగించాల్సిందే.. మిల్లర్లకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరిక
సుందరయ్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
పనకబండలో ఇంటింటికి ఫామ్-18 స్లిప్పుల పంపిణీ
Cyclone Arnab | తీరాన్ని తాకకముందే ఉత్తరాంధ్ర జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అర్నాబ్ తుపాను..!
‘నవంబర్ 13 నుండి 16 వరకు నల్లగొండలో అగ్రి షో’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

