మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల (Manchiryal ) జిల్లా కేంద్రంలో తల్లి కూతుళ్లు ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడ్డారు. ఘటనలో తల్లి మృతి చెందగా కూతురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. చున్నంబట్టి వాడ ఏరియాలో నివాసముంటున్ పస్తం పోశమ్మ (80) తన కూతురు రాజమ్మ (35) ఇద్దరు కలిసి ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
బుధవారం సాయంత్రం ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరూ గొడవ పెట్టుకున్నారు. అనంతరం గుర్తు తెలియని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన మనువడు పస్తం బిమేశ్ ఆటోలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తల్లి పోశమ్మ రాత్రి మృతి చెందింది.
కూతురికి ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి సైతం క్రిటికల్ గా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు వారి బందువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ దివాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.