Vedma Bhojju | సొంత పార్టీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ వివక్ష.. ఫ్లెక్సీలో ఫొటోకే దిక్కులేదు.. వీడియో
Vedma Bhojju | కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత నియోజకవర్గం ఖానాపూర్లో జరుగుతున్న ఓ అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫోటోకే దిక్కు లేకుండా పోయింది.
Vedma Bhojju | కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రోటోకాల్ విషయం పాటించడంలోనైనా, కుర్చీల కోసం తన్నుకోవడంలోనైనా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీ నేతలమనే విషయాన్ని మరిచిపోయి ఒకరినొకరు గౌరవించుకోవాలన్న కనీస సోయి కూడా లేకుండా కనిపిస్తుంటారు. అందుకు తాజా ఘటనే ఉదాహరణ. కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత నియోజకవర్గం ఖానాపూర్లో జరుగుతున్న ఓ అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫోటోకే దిక్కు లేకుండా పోయింది.
ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఏకరూప దుస్తుల (యూనిఫామ్స్) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాత్రం ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫొటో, మరోవైపు మంత్రి అడ్లూరి ఫొటో, పైన మరో ముగ్గురు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఫొటోలు ఉన్నాయి.. కానీ స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఫొటో మాత్రం పెట్టలేదు. దీంతో ఎమ్మెల్యే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఐటీడీఏ సిబ్బంది వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించారు.
సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఫోటోకి కూడా దిక్కులేదు!
మంత్రి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఫొటో మిస్సింగ్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే… https://t.co/JO4v3OcZUz pic.twitter.com/2bNbCrZaFi
— Telugu Scribe (@TeluguScribe) August 22, 2026
Read Also :
Smart ration cards | తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ.. హరిపురంలో కార్డుల పంపిణీ నిలిపివేత
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

