ఆదిలాబాద్ : ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం నిర్మల్ జిల్లాకుకు వచ్చిన దేశ మాజీ ప్రధాని హెచ్.డి దేవేగౌడకు ఎన్.టి.ఆర్ మినీ స్టేడియంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వాగతం పలుకుతూ పూలమొక్కలను అందజేశారు. మంత్రి వెంట మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు.