తాండూర్ : వాతావరణ మార్పులతో కీటక జనిత మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభావిత గ్రామాలలో వైద్య శిబిరాలు ( Medical camps ) ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ (DMHO Harish Raj) వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బందికి సూచనలు చేశారు.
వంద శాతం గర్భిణులను నమోదు చేయాలని, పిల్లలకు టీకాలు ఇప్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు చేయించాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో గ్రామాలలో దోమలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
దోమలు కుట్టకుండా, దోమల పుట్టకుండా ఇండ్లలో ఇంటి పరిసరాలలో నీరు నిలువ లేకుండా చేయాల న్నారు. ఆరోగ్య కేంద్రంలోని లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్ ను సందర్శించి మందులు, పరికరాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.