మంచిర్యాల ఏసీసీ, జూన్ 22 : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో మలేరియా, డెంగీ వ్యాధుల నివారణకు వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో సుబ్బారాయుడు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బాలాజీ మినీ ఫంక్షన్ హాలులో జిల్లా వైద్యాధికారులు, పల్లె దవాఖాన ఎంఎల్హెచ్పీలు, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలకు కీటక జనిత వ్యాధులపై రెండు రోజుల పాటు శిక్షణ తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి రోగులను గుర్తించి, వైద్య సేవలందించాలని సూచించారు. వార్డుల శుభ్రత కోసం పట్టణాలు మున్సిపల్ సిబ్బంది, గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. మలేరియా, డెంగీ వ్యాధులకు అందించే చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైద్యాధికారి అనుమతి ద్వారానే సిబ్బంది సీఎల్ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీబీడీసీపీ ప్రోగ్రాం అధికారి అనిత, డిప్యూటీ డీఎంహెచ్వో విజయ నిర్మల, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి నీరజ, రాష్ట్ర డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్ ఎండీఏ డా.రాజేందర్, డీపీవో ప్రశాంతి, ఎస్యూవోలు నాందేవ్, సత్యనారాయణ, శ్రీనివాస్, హెచ్ఈ అల్లాడి శ్రీనివాస్, డెమో బుక్క వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.