బాసర, ఆగస్టు 30 : నాలుగు రోజులుగా కురి సిన భారీ వర్షాలకుతోడు మహారాష్ట్రలో పడిన వానలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తు న్నది. ఫలితంగా బాసర వద్ద గోదారి ఉగ్రరూ పం దాల్చింది. పుష్కరఘాట్లు నీట మును గగా.. సరస్వతీ అమ్మవారి ఆలయానికి వెళ్లే దా రులు జలమయం అయ్యాయి. దుకాణా స ముదాయాలు, పలు కాలనీల్లోకి వరద చేరిం ది. పరిస్థితిని నిర్మల్ ఎస్పీ జానకి షర్మీల పరిశీ లించారు. 1984 తర్వాత అంటే దాదాపు 40 ఏండ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని బాసర గ్రామస్తులు పేర్కొంటున్నారు.
వ్యాసుడిని తాకిన వరద
సరస్వతీ అమ్మవారి ఆలయం ప్రవేశమెట్ల వద్ద పక్కనే ఉన్న వేద వ్యాసుడి ఆలయం వరదతో జలమయం అయింది. దాదాపు 42 ఏళ్లకు క్రితం ఇటువంటి వరదలు వచ్చాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చి భారీగా వరద ఆలయం వద్దకు వచ్చిందని స్థానికులు అంటున్నారు. 1984లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. గోదావరిలోకి భారీగా చేరి దాదాపు బ్రిడ్జి వద్దకు నీరు చేరిందని స్థానికులు తెలిపారు.
నీట మునిగిన ఆలయ పరిసరాలు
బాసర ఆలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా జ లమయమయ్యాయి. భక్తులు ఎటు వెళ్లలేక బాసరలోనే ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రైవేటు లాడ్జిల్లో హరిహర కార్టేజెస్, వడ్డెపల్లి నర్సింగ్‌రావు అతిథి గృహం, దీక్ష లాడ్జి కొంత మేర జలమయమయ్యాయి. పక్క నే ఉన్న భవనాల్లో అద్దెకు ఉంటున్న వారిని గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయింది. ఇండ్ల లో ఉంటున్న 40 మందిని ఎస్డీఆర్ఎఫ్ బృం దం, పోలీసులు, రెవెన్యూ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పరిస్థితిని పరిశీలించి ఎస్పీ జానకి షర్మిల
బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పరిస్థితిని ఎస్పీ జానకి షర్మీల పరిశీలించారు. ట్రాక్టర్లో వెళ్లి ప్రైవేటు లాడ్జీలతోపాటు, ఓ భవనంలో ఉన్న అద్దెదారులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. వారికి అవసరమైన భోజన సదుపాయాన్ని కల్పించారు. శుక్రవారం రాత్రి వరకు పరిస్థితిని ఎస్పీ దగ్గరుండి సమీక్షించారు. ఆమె వెంట సీఐ మల్లేశ్, ఎస్సై శ్రీనివాస్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ యంత్రాంగం ఉన్నారు.
చెరువులను తలపించిన చేలు
బాసర మండల కేంద్రంలోని దాదాపు వెయ్యి ఎకరాలకుపైగా పంటలు వరదలో మునిగి చెరువులను తలపిస్తున్నాయి. బాసర బిద్రెల్లి రాటి, దౌడాపూర్, ఓని, కిర్గుల్, కౌట, సాలాపూర్ గ్రామాల్లోని పొలాలు దాదాపు పూర్తిగా నీట మునగడంతో 60 శాతానికి పైగా జలమ యం అయ్యాయి. ప్రభుత్వం ఎకరాకు రూ. 30 తవేలు నష్టపరిహారాన్ని అందించాలని రైతులు వేడుకుంటున్నారు.
రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు
బాసర మీదుగా వెళ్లే పలు రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు నిలిపి వేశారు. బాసర గోదావరి వద్ద గల రైల్వే బ్రిడ్జి దగ్గరలో గోదావరి విజృభించడంతో రైల్వే అధికారులు అప్రమత్తమై బాసర మీదుగా వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేశారు. కాగా.. బాసర మండలంలోని బిద్రెల్లి వద్ద వాగు పొంగి పొర్లడంతో భైంసా-నిజామాబాద్ వెళ్లే రహదారి పూర్తిగా వరదమయం కావడంతో రాకపోకలను అధికారులు నిలిపి వేశారు. మహారాష్ట్ర నుంచి భారీగా వాగులోకి నీరు చేరడంతో పరిస్థితి ఏర్పడింది. అలాగే బాసర నుంచి ఓని, కౌట, సాలాపూర్, సావర్గం, కిర్గుల్ వెళ్లే మార్గంలో వాగు పొంగి పొర్లడంతో రాకపోకలను కూడా నిషేధించారు.
ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో భారీ వరద
బాసర గోదావరి వద్ద భారీగా వరద నీరు చేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర నుంచి తరలివస్తున్న భారీ వరద నీటితో శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తి వేయడంతో దాదాపు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నది. ఎస్సీరెస్పీ 39 గేట్లను ఎత్తివేయగా 5 లక్షల 70 వేల అవుట్ ఫ్లోతో వరద నీరు బయటకు పోతున్నది. బాసర వద్ద వరద నీరు మరికాస్త ఎక్కువైతే పరిస్థితి చేజారేలా ఉంది. శనివారం బాసరను కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. వరద దాటికి ప్రభావితం అయిన ప్రాంతాలను పరిశీలించారు. బాసర ఆలయం, గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులతో మాట్లాడి నష్టాన్ని తెలుసుకున్నారు. పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కానరాని ఇన్చార్జి మంత్రి జూపల్లి
మూడు రోజుల నుంచి బాసర జలదిగ్భందంలో ఉండగా.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించలేదు. నియోజకవర్గ ఇన్చార్జి కూడా బాసరను సందర్శించిన పాపాన పోలేదు. అధికారులు స్పందించి తమకు ఆదుకోవాలని దుకాణా సముదాయ యజమానులు, ప్రజలు, ప్రైవేటు లాడ్జీ నిర్వాహకులు కోరుతున్నారు.