తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చంద్రపల్లిలో మహిళా సమాఖ్య గ్రామ సంఘం భవనానికి భూమిని విరాళంగా ( Land donation ) అందజేయడం అభినందనీయమని ఏపీఎం శ్యామల అన్నారు. తాండూర్ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
చంద్రోదయ గ్రామ సంఘం అధ్యక్షురాలు పెండ్యాల చంద్రకళ గ్రామ సంఘం బిల్డింగ్ కోసం వారి సొంత స్థలాన్ని దానంగా ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా మండల సమాఖ్య ఈసీ సభ్యులు చంద్రకళను శాలువాతో సన్మానించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడి అందరికీ ఆదర్శంగా నిలవాలని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి మహిళకు తెలిపే విధంగా చూడాలని సభ్యులను కోరారు.