ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 27 : దహెగాం మండలం గెర్రె గ్రామంలో కుల దురహంకార హత్యకు గురైన తలండి శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి నేర్పల్లి అశోక్ మాట్లాడుతూ శ్రావణి భర్త శేఖర్ కుటుంబ సభ్యులపై రెండు హత్య కేసులు నమోదు చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆమె కుటుంబానికి మూడెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాలశ్రీ, నేర్పెల్లి అశోక్, ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్, సీపీఎం పార్టీ కాగజ్‌నగర్ కన్వీనర్ ముంజం ఆనంద్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గెడం టీకానంద్, గోడిసెల కార్తీక్, ఉపాధ్యక్షులు పురుషోత్తం, నిఖిల్, సహాయ కార్యదర్శి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వసాకే సాయి, చాపిలే సాయికృష్ణ, ఐద్వా సం ఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వినోద, అనిత, జిల్లా ఐద్వా కోశాధికారి షాహిన్,
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బకన్న, నైతం రాజు, దహెగాం మండల అధ్యక్షుడు శంకర్, జిల్లా కమిటీ సభ్యురాలు దూల లక్ష్మి, శాగం కమల, గ్రామ అధ్యక్షులు మేకల శంకర్, హనుమంతు, గోండ్వానా ఆదివాసీ కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నయ్య, అంబేదర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కోట సతీశ్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణ య్, ఆదివాసీ సంఘం నాయకులు రాజేశ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి పోషమల్లు, స్త్రీ విముక్తి మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు లావణ్య, నాయకులు మహేశ్, తలండి మధుకర్, సతీశ్, పెద్ది సంతోశ్ ప్రజలు పాల్గొన్నారు.