ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం చిరస్మరణీ యమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్(బీ) గ్రామంలో ఏర్పాటు చేసిన బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వెంట బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్ అనిల్, ఎంపీపీ తుల శ్రీనివాస్, డీడీసీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆశమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బాపూజీ సేవలను కొనియాడారు.
– బోథ్, సెప్టెంబర్ 6