కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన దెబ్బతిన్న పంట పొలాలను సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరిశీలించారు. దహెగాం మండలంలోని వరద ముంపు ప్రాంతాలయిన ఒడ్డుగూడ లగ్గాం, దహెగాం, అయినం, బీబ్రా, పెసర్కుంటా కొత్మీర్ ముంపు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
పంట నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందజేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ కార్యక్రమాలు చేసట్టాలన్నారు.