టీఆర్ఎస్ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు
మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 8: నూతనంగా ఎన్నికైన వార్డు కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పార్టీ కోసం చురుకుగా పనిచేయాలని ఎమ్మెల్యే తనయుడు, టీఆర్ఎస్ యువ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 29 వార్డు హైటెక్కాలనీలో వార్డు కమిటీల ఎన్నికకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి వివరాలను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకువెళ్లాలని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. వార్డు కౌన్సిలర్ చైతన్య సత్యపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీలు ఎన్నుకున్నారు. 29వార్డు కమిటీ అధ్యక్షుడిగా చేతి బాలరాజు, ఉపాధ్యక్షుడిగా రహీం, యూత్‌కమిటీ అధ్యక్షుడిగా రోహిత్, ఉపాధ్యక్షుడిగా అమర్నాథ్, మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా రియా జ్, ఉపాధ్యక్షుడిగా జమీల్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జెట్టి లత, ఉపాధ్యక్షురాలిగా షబానా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అత్తి సరోజ, తోట తిరుపతి, జయరాం, పోచమల్లు, షఫీ, వదూద్, నజీర్, హన్మంతరావు, జీఫర్, అజీజ్, సారయ్య, తదితరులు పాల్గొన్నారు. 33వ వార్డు టీఆర్ఎస్ వార్డు కమిటీని కౌన్సిలర్ సుమతి అధ్యక్షతన ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, బీ మురళి, చంద్రశేఖర్హండే, గొంగళ్ల శంకర్, ఖాజామియా, తదితరులున్నారు.
జన్నారం మండలంలో..
జన్నారం, సెప్టెంబర్ 8 : ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని కవ్వాల్, మహ్మదాబాద్, జన్నారం గ్రామాల్లో టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సీపతి బుచ్చన్న, వైస్ చైర్మన్ సిటిమల భరత్‌కుమార్, కో ఆప్షన్ సభ్యుడు, మున్వర్అలీఖాన్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్ సమక్షంలో ఎన్నిక నిర్వహించారు. కవ్వాల్ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా రవిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా జలపతి, మహ్మదాబాద్ అధ్యక్షుడిగా రాంటెంకి శంకర్, ఉపాధ్యక్షుడిగా సింగం రమేశ్, షేక్ ఇమామ్, ప్రధాన కార్యదర్శిగా జాడి మోగిలి, జన్నారం అధ్యక్షుడుగా షేక్ మౌలానా, ఉపాధ్యక్షుడిగా జిలుక అనిల్, కొత్త జయశంకర్, ప్రధాన కార్యదర్శిగా మర్సుకోల తిరుపతి, సంయుక్త కార్యదర్శిగా మునిందర్గౌడ్, మహిళా విభాగం అధ్యక్షు రాలిగా మర్సుకోల సుశీల ఎన్నికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జాడి గంగాధర్, ఎంపీటీసీ సభ్యుడు మహ్మద్ రియాజొద్దీన్, సర్పంచ్ బూసవేని గంగాధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
నస్పూర్ మండలంలో..
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 8: నస్పూర్ మున్సిపాలిటీ 13వ వార్డులో ఎన్నికల ఇన్చార్జిలు తిప్పని రామయ్య, కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, జక్కుల రాజేశం, పానుగంటి సత్తయ్య, బండి తిరుపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి ఆధ్వర్యంలో కమిటీలను నియమించారు. వార్డు కమిటీ అధ్యక్షుడిగా బుద్దె రవి, ఉపాధ్యక్షులుగా వెంకటస్వామి, కోవ దేవయ్య, కార్యదర్శిగా నూకల మధూకర్, సహాయ కార్యదర్శిగా ఎర్ర అశోక్, యూత్ అధ్యక్షుడిగా కొలిపాక మహర్షి, ఉపాధ్యక్షులుగా గట్టు అన్వేశ్, కార్యదర్శిగా నామని సాయి, సంయుక్త కార్యదర్శిగా సుముద్రాల నిఖిల్, కోశాధికారిగా కంచెం సాయికుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా వెన్నమనేని లక్ష్మిలతో పాటు పలువురిని కార్యవర్గ సభ్యులుగా నియమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ ఖాసీం, నీలం సదయ్య, రామిడి మహేందర్‌రెడ్డి, కొలిపాక సమ్మయ్య, శెట్టి రమణ, తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్ మండలంలో..
హాజీపూర్, సెప్టెంబర్ 8 : మండలంలోని గడ్పూర్, నంనూర్ గ్రామ కమిటీలను బుధవారం ఎన్నుకున్నారు. గడ్పూర్ గ్రామ అధ్యక్షుడిగా గూడ లింగయ్య, ఉపాధ్యక్షుడిగా కిషన్, కార్యదర్శిగా భూమయ్య, సంయుక్త కార్యదర్శిగా నర్సయ్య, కోశాధికారిగా తిరుపతితో పాటు మరో ఆరుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా బొడ్డు మల్లేశ్, ఉపాధ్యక్షుడిగా ఆనందాచారి, కార్యదర్శిగా సత్తయ్య, సంయుక్త కార్యదర్శిగా కొమురయ్య, కోశాధికారిగా రమేశ్‌తో పాటు మరో ఆరుగురిని కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు హాజీపూర్ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, రైతు బంధు సమితి కన్వీనర్ పూస్కూరి శ్రీనివాస్ రావు, మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, జీవన్‌రావు, తదితరులున్నారు.
వేమనపల్లి మండలంలో..
వేమనపల్లి, సెప్టెంబర్ 8 : చామనపల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కొమిరెల్లి చీకటిని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వైస్ ఎంపీపీ ఆత్రం గణపతి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు తలండి భీమయ్య పేర్కొన్నారు. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన చీకటికి నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జెల్ల మొండి, ఉపసర్పంచ్ మహేశ్‌రెడ్డి, నాయకులు పర్వతాలు, చంద్రయ్య, శరత్, శంకర్ తదితరులున్నారు.