సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కోత్మీర్లో విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం
దహెగాం, జూలై 6: మన పథకాలు దేశానికి ఆదర్శంగా ని లుస్తున్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని కోత్మీర్ గ్రామంలో రాష్ట్ర విద్యుత్ అభివృద్ధి నిధులు రూ 1.60 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సబ్‌స్టేషన్ ద్వారా 12 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. అదేవిధంగా కౌటాలలో 133 కేవీ విద్యుత్ కేంద్రం పనులను త్వరలో ప్రారంభించి ఆరునెలల్లో పూర్తయ్యేలా చర్య లు తీసుకుంటానని చెప్పారు. నియోజకవర్గంలో 300 కి లోమీటర్ల రోడ్ల నిర్మాణంతో పాటు 37 వంతెనలు నిర్మించామన్నారు. త్వరలోనే 57 ఏళ్లు నిండిని వారికి కూడా పిం ఛన్ అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పల్లెప్రగతి, హరితహారంలో ప్రతి ఒ క్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జడ్పీటీ సీ తాళ్లపల్లి శ్రీరామారావు, వైస్ ఎంపీపీ చౌదరి సురేశ్, సిం గి ల్ విండో చైర్మన్ కోండ్ర తిరుపతిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ కొ మురగౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్‌గౌడ్, ఎస్ఈ రమేశ్, డీఈ వాస్దేవ్, ఏడీఈ బా కృష్ణ, ఏఈలు రవీందర్, శ్రీనివాస్, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచ్‌లు తరున్నం సుల్తానా, బండ కృష్ణ, వశాక మురారి, ర త్నం మధుకర్, కారు రాజన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నజీ ర్, నాయకులు సోను, ప్రసాద్‌రాజ్, బాలకిష్రావు, గజ్జల శ్రీనివాస్, రాంటెంకి మల్లేశ్, పుప్పాల సంతో ష్, జ ర్పుల కృష్ణ, హట్కరి మధుకర్, తుమ్మిడ పాపయ్య పాల్గొన్నారు.
ఇట్యాల సర్పంచ్‌కు ప్రోత్సాహక బహుమతి..
హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించిన ఇట్యాల సర్పంచ్ వశాక మురారీకి జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు సమకూర్చిన రూ. 10 వేలను ఎమ్మెల్యే కోనప్ప మంగళవా రం అందజేశారు. గతేడాది హరితహారంలో నాటిన మొక్కలను పెంచిన వారికి ప్రోత్సాహక బహుమతి ఇస్తానని జడ్పీటీసీ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే అందజేశారు.