కోటపల్లి, ఫిబ్రవరి 10 : సాంకేతిక పరిజ్ఙానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని భారతీయ మెట్ట పరిశోధనా సంస్థ (క్రీడా) డైరెక్టర్ వీకే సింగ్ అన్నారు. శనివారం కోటప ల్లి మండలం ఆలుగామ గ్రామంలో భారతీ య మెట్ట పరిశోధనా సంస్థ హైదరాబాద్ ఆ ధ్వర్యంలో ఎస్సీ సబ్ ప్లాన్, భారత ప్రభుత్వం వారిచే కిసాన్ మేళా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ రైతుల అభివృద్ధికి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, అందులో భాగంగానే రైతులకు విత్తనా లు, టార్పాలిన్లు, స్ప్రేయర్లు, మెషినరీలు అం దజేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెం పొందించేందుకు రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్యవంతులను చేస్తున్నామని చెప్పారు.
క్రీడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను రైతులు సద్వినియో గం చేసుకోవాలని, ఎస్సీ రైతుల అభివృద్ధికి తమ సంస్థ ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. వ్యవసాయంలో శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుటలో భాగంగా వ్యవసాయంలో డ్రోన్ ద్వారా రసాయనాలు, కలుపు మందులు, పు రుగు మందులు, తెగులు నివారణకు మందులు ఎలా పిచికారి చేసుకోవాలో ప్ర యోగాత్మకంగా వివరించారు. ఈ విధానం వ ల్ల రైతులకు సమయం, నీరు, రసాయన మం దులు ఆదా అవుతాయని, డ్రోన్ల ద్వారా ఐ దు నిమిషాల్లో ఎకరం స్ప్రే చేసుకోవచ్చని వివరించారు.
రైతు గ్రూప్‌లకు సబ్సిడీపైన డ్రోన్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. సాయిల్ సైన్స్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎస్ఎస్ బల్లోలి, ప్రిన్సిపాల్ సైంటిస్ట్‌లు కేఎస్ రెడ్డి, శ్రీదేవి శంకర్, టీవీ ప్రసాద్, జీ. వెంకటేశ్, విశాకుమారి, అన్షిద, ఆశిష్, నూరు మూర్తి, కోటపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్, ఎస్సీ రైతులు పాల్గొన్నారు.