
ఉట్నూర్ : ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌గా కనక లక్కేరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
స్థానిక కొమురంభీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ ముఖ్య అతిథిగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోడెం నగేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తుందని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌గా లక్కేరావును మరోసారి ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు.
గిరిజనుల దీపావళికి గుస్సాడీలకు అందించేందుకు ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసిందన్నారు. మాజీ ఎంపీ నగేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి గిరిజనుల సమస్యలు తెలుసన్నారు. అందుకే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. ఐటీడీఏకు ప్రజలకు మధ్య వారధిగా సలహా మండలి ఉండి గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ప్రాంగణంలోని కొమురంభీం విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.
అనంతరం గుస్సాడీలకు ప్రభుత్వం అందించిన 10వేల నగదును అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో భీంరావు, నాయకురాలు ఈశ్వరిబాయి, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, మెస్రం దుర్గు, మర్సకోల తిరుపతి, దుర్గం శేఖర్, సుమన్‌బాయి, భూమన్న, మెస్రం మనోహర్, పెందూర్ ప్రభాకర్, బాపురావు, హన్మంత్‌రావు, దేవ్‌రావు, తానాజీ, ఆర్సీవో గంగాధర్, భాస్కర్, ఐటీడీఏ అధికారులు, ఏటీడబ్ల్యూఏసీ డైరెక్టర్లు, గిరిజన పెద్దలు ఉన్నారు.