ఎదులాపురం, మార్చి 1 : ఆదిలాబాద్ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన డిస్పెన్సరీని శనివారం హైకోర్టు జడ్జి జస్టిస్ రేణుకా యార ప్రారంభించారు. అంతకముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కోర్టు ఆవరణలో మొక లు నాటారు. అనంతరం అందుబాటులో ఉండే వైద్యులు, అందించే సేవలు, సిబ్బంది వివరాలను కలెక్టర్ రాజర్షి షా ఆమెకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యా యమూర్తి ప్రభాకర్‌రావు, న్యాయమూర్తులు శివరాంప్రసాద్, ప్రమీల జైన్, దుర్గారాణి, సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్, ఎస్పీ గౌష్ ఆలం, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్‌రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సాధన, పీపీ రామణారెడ్డి పాల్గొన్నారు.
న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి కృషి చేస్తానని హైకోర్టు జడ్జి జస్టిస్, జిల్లా అడ్మిస్ట్రేటివ్ జడ్జి రేణుకా యార అన్నారు. జిల్లాకు వచ్చిన ఆమెను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి సహకారం అందిస్తానని తెలిపారు.