ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ గురువారం కలిశారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఆయనతోపాటు జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, పూర్ణచందర్ నాయక్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ఖానాపూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ను పూర్ణచందర్నాయక్తోపాటు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కూడా ఆశించారన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్ధి జాన్సన్‌నాయక్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని, ఇద్దరు నాయకులు అండగా నిలవాలని సూచించారు.