నేరడిగొండ, మే 16 : టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-1 ఫలితాలపై నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం, ప్రశ్నించే వారిపై కేసులు పెట్డడం ఇదెక్కడి న్యాయమని బోథ్ ఎమ్మెల్యేజాదవ్ అనిల్ కాంగ్రెస్ ప్రభుత్వా న్ని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ప్రెస్మీట్లో మాట్లాడారు. కొంతమందికి గూప్-1 పరీక్షల్లో సీక్వెన్స్‌గా ఎక్కువ మా ర్కులు రావడం, అందులో రాములు నాయక్ కోడలికి టాప్ ర్యాంకు రావడంపై అనుమానం వ్యక్తం చేయడం తప్పెలా అవుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉందన్నారు.
ఇది రాములు నాయక్ పెట్టిన కేసు కాదని, నెల ముందు పాడికౌశిక్‌రెడ్డి ప్రెస్మీట్లో మాట్లాడితే ఇప్పుడు కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ పెద్దలు కావాలని చేశారని అనుమానం నెలకొన్నదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నదన్నారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిప క్షం బలంగా ఉంటే నే ప్రభుత్వం మం చిగా నడుస్తదన్నార ని, మేము ప్రతిపక్ష పార్టీగా బలంగా మాట్లాడితే కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అలా అనుకుంటే ముం దుగా సీఎం పైనే అ ట్రాసిటీ కేసు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఎందుకంటే 17 మంది గిరిజన విద్యార్థులపై చదువుల కోసం అమెరికా వెళ్లి స్కాలర్షిప్ అందక రోడ్డుపై తిరుగుతున్నారని అన్నారు.
ఈ విషయంలో అసెంబ్లీలో కూడా తాను ప్రస్తావించినట్లు కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. గిరిజన విద్యార్థులకు కనీసం కూలీ పనులు కూడా దొరకడం లేదని తమకు తరచూ ఫోన్ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం గిరిజన మంత్రి పదవి ఇవ్వకుండా జాప్యం చేయడంపై గిరిజనులపై ప్రభుత్వం ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తోందో అర్థమవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ దళిత అధ్యక్షుడిని చేయాలన్న ముఖ్యమంత్రి అన్న వ్యాఖ్యలకు, ముందుగా మీ పార్టీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గమనించి ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేయడం మానుకోవాలన్నారు.