మంచిర్యాల, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాల లెక్కలు బట్టబయలయ్యాయి. ప్రతిసారి ఎవరో ఒకరు ఫిర్యాదు చేయడం, దానిపై విచారణ చేయడం, రిపోర్ట్ సడ్మిట్ చేయడం మిన్నకుండిపోవడం తప్ప.. చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. అసలు టీఎన్జీవోల అక్రమాలకు సాక్ష్యాధారాలు ఏమున్నాయని అడిగిన ప్రతిసారి ఉన్నతాధికారుల నుంచి దాటవేసే సమాధానాలే తప్ప.. అసలు విషయం బయటికి వచ్చేది కాదు. కానీ.. ఇప్పుడు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలోని అక్రమాలన్నింటినీ నిరూపించే ఆధారాలు ‘నమస్తే తెలంగాణ’ చేతికి చిక్కాయి.
ఇప్పటి వరకు చేసిన సర్వేలు, టీఎన్జీవోలు చేసిన మోసాలపై గతంలోనే కథనాలు ప్రచురితమయ్యాయి. వాటికి కొనసాగింపుగా టీఎన్జీవో అక్రమాల లెక్కలన్నీ బయటపెట్టే అసలు సాక్ష్యాధారాలను ఇప్పుడు పాఠకుల ముందుకు తెస్తున్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తారని.. అక్రమాలకు కారకులైన టీఎన్జీవోల నాయకులపై కఠిన చర్యలు తీసుకుని, నష్టపోయిన టీఎన్జీవో ఉద్యోగులకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నాం.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఉన్న సర్వే నంబర్ 42లో 29.30 ఎకరాలను 2000 సంవత్సవంలో అప్పుడున్న ప్రభుత్వం టీఎన్జీవోలకు ఇచ్చింది. ఈ మేరకు ఫిజికల్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసింది. 2010లో లక్కీ డ్రా తీసి ఎవరికి ఏ ప్లాట్ వచ్చిందో ఆ నంబర్ల ఆధారంగా 341 మంది టీఎన్జీవోలకు ప్లా ట్లు కేటాయిస్తూ అలాట్మెంట్ లిస్టును తయారు చేశారు. ఆ లిస్టును అనుసరించి అప్పుడున్న మంచిర్యాల ఎంఆర్వో ఫైనల్ పట్టా ధ్రువపత్రాలను జారీ చేశారు. ప్లాట్ అలాట్మెంట్ లిస్టులో 341 మందికి సంబంధించి ఎవరికి ఏ ప్లాట్ కేటాయించారు, వారి కి ఇచ్చిన పట్టాలు, వాటిపై ఉన్న ప్లాట్ నంబర్లన్నీ స్పష్టంగా ఇప్పుడు ‘నమస్తే’ చేతికి చిక్కాయి.
కాగా.. నస్పూర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో కుడి పక్కన ఉన్న 119 ప్లాట్లలో కొందరు టీఎన్జీవోలు ఇండ్లు నిర్మించుకోగా, మరికొందరు ఓపెన్ ప్లాట్లుగా వాటిని వదిలేశారు. కానీ.. ఈ 119 మందిలో 2010లో ఫ్లాట్ అలాట్మెంట్ లిస్టు ప్రకారం పట్టాదారులుగా ఉన్న వారి స్థలాల్లోకి, మరొకరు వచ్చి ఇల్లు కుట్టుకున్నారు. ఫ్లా ట్ అలాట్మెంట్ లిస్టు ప్రకారం పట్టాదారు ఒకరు ఉంటే, ఇండ్లు కట్టుకున్న వారు మరొకరు ఉన్నారు. ఈ లెక్కన అప్పుడున్న ఎంఆర్వో ఇచ్చిన ఫైనల్ ప ట్టాపై ఉన్న ప్లాట్ నంబర్లను, పేర్లను ఫోర్జరీ చేసి, గ్రామ పంచాయతీ అధికారులను తప్పుతోవ పట్టిం చి ఇండ్ల నిర్మాణాలు చేసినట్లు స్పష్టం అవుతున్నది. ఆ వివరాలను ఇక్కడ టేబుల్ రూపంలో ఇస్తున్నాం.
లెక్క ప్రకారం 2010లో ప్లాట్ అలాట్మెంట్ లిస్టు లో 341 మంది టీఎన్జీవోలు ఉన్నారు. ఈ లిస్టులో లేని 8మంది టీఎన్జీవోలు అక్రమంగా ప్లాట్లు పొం ది అందులో ఇల్లు కట్టుకున్నారు. ప్రభుత్వంతో సం బంధం లేకుండా ఎంఆర్వో, ఆర్డీవో, కలెక్టర్ల నుంచి ఎలాంటి ఆర్డరు లేకుండా కేవలం టీఎన్జీవో సొసైటీ సొంత తీర్మాణంతో ఈ 8 మందికి ప్లాట్లు కేటాయించారు. ఈ హక్కు టీఎన్జీవో సొసైటీకి ఎక్కడిది.. ప్ర భుత్వం దృష్టిలో లేకుండా ఈ 8 మంది ప్లాట్లు తీసుకోవడం ఎలా లీగల్ అవుతుంది. ఈ విషయం అధికారులకు తెలియదా? తెలిసి కూడా మిన్నకుండిపోతున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.
అక్రమంగా ప్లాట్లు పొందిన వారు టీఎన్జీవో సంఘంలో కీలక పదవులు అనుభవిస్తూ ఇష్టారాజ్యంగా కావాల్సిన దగ్గర ప్లాట్లు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. లెక్క ప్రకారం ఒక్కో టీఎన్జీవోకు ప్ర భుత్వం 175 గజాల స్థలాన్ని ఇచ్చింది. హన్మంతరావు కట్టుకున్న ఇల్లు 242 గజాలు, కె.సురేశ్ బాబు కట్టుకున్న ఇల్లు 262 గజాల్లో ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వారు ఇల్లు కట్టుకున్న పట్టించుకునే నాథుడే లేడు. ఇటీవల సర్వే నంబర్ 42 ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టిన ఓ ఐదంతస్తుల మేడను కూ ల్చిన అధికారులు ఇలా ఎక్కువ ప్రభుత్వ స్థలాన్ని ఆ క్రమించి కట్టిన ఇండ్లపై చర్యలు ఎందుకు తీసుకోవ డం లేదు. అంటే ఉద్యోగులకు ఒక లెక్క.. సామాన్యులకు ఒక లెక్కనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ 8 మంది అక్రమంగా ప్లాట్లు పొందడంతో ఆగిపోలేదు. వీరికి బై నంబర్లు వేసి ప్లాట్లు కేటాయించారు. గడియారం శ్రీహరికి ప్లాట్ నంబర్ 59/ఏ అని కేటాయిస్తే ఆయన ప్లాట్ నంబర్ 24లో ఇల్లు కట్టుకున్నాడు. శ్రీపతి బాపురావుకు 5/ఏ ప్లాట్ ఉంటే 73వ ప్లాట్‌లో, ఏసయ్యకు 70/ఏ ఉంటే ఆయనకు 101 ప్లాట్‌లో, పొన్న మల్లయ్యకు 70/బీకి బదులు ఆయన 102 ప్లాట్‌లో, సునీతకు 92/ఏ ఉండగా 63 ప్లాట్‌లో, కె.సురేశ్‌బాబుకు 77/ఏకు బదులు 104 ప్లాట్‌లో, హన్మంతరావుకు 77/బీ బదులు103 ప్లాట్‌లో, బి.రాంమోహన్ 4/ఏకు బదులు 113 ప్లాట్‌లో ఇల్లు కుట్టుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది. ఇవన్నీ అక్రమాలు కావా? అధికారులకు ఇవి కనిపించడం లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక్కడ మరో గొప్ప విషయం ఏంటంటే.. ఇప్పుడున్న టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి, అసొసియేషన్ ప్రెసిడెంట్ శ్రీపతి బాపురావు, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నం మల్లయ్య వీరంతా ఎప్పుడో గెజిటెడ్ ఆఫీసర్లు అయ్యారు. కానీ.. నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్‌లో కొనసాగుతున్నారు. ఇలా గెజిటెడ్ ఆఫీసర్లు, టీఎన్జీవోలుగా కొనసాగొద్దని రాష్ట్ర ప్రభుత్వం జూలై 24, 2024న ఉత్తర్వులు విడుదల చేసింది. మంచిర్యాల జిల్లాలో మాత్రం దాన్ని టీఎన్జీవో సంఘం పాటించడం లేదు. ఈ అక్రమాల విషయాలు, గెజిటెడ్ ఆఫీసర్ల అనధికారిక కొనసాగింపు తెలిసి కూడా టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గం వీరిని తొలగించేందుకు వెనకాడుతుండడటం గమనార్హం.
ఇప్పుడున్న టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి, సెక్రెటరీ బి.రాంమోహన్, అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీపతి బాపురావు, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, జాయింట్ సెక్రెటరీలు సునీత, ఏసయ్యతోపాటు గతంలో టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న కె.సురేశ్‌బాబు, సెక్రెటరీ పి.హన్మంత్‌రావులు ఉన్నారు.
టీఎన్జీవో సొసైటీకి సం బంధించిన అక్రమాల రిపోర్టు సీసీఎల్ఏ, కలెక్టర్ దగ్గర ఉన్నాయి. ఎన్ని సార్లు సర్వే చేసి న ఇదే రిపోర్ట్ వస్తది. కొత్తగా మారేది ఏం లే దు. ఉన్న రిపోర్ట్‌ల ఆధారంగా ఇప్పటికైనా క లెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు పాల్పడిన టీఎన్జీవో ఉద్యోగులపై డిపార్ట్మెంటల్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఇక జాప్యం చేయరని భావిస్తున్నా.
– నయీం పాషా, సామాజిక కార్యకర్త.