బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో (Basara Triple IT) యువ మనస్సుల జీవితాలను మార్చే లక్ష్యంతో గురువారం నిర్వహించిన ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ (Inspire and Ignite) యూత్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ కార్యక్రమం విజయవంతమైంది.
వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్, స్పీకర్ రంజిత్ దాసరి, మనస్తత్వవేత్త శ్రీనివాస్ అడ్డిగా, సుధాకర్ దిండి, శ్రీరాము ఉప్పపు, ప్రవీణ్ కాకతీయ శాండ్బాక్స్, రితేష్ పాటిల్ కెమిస్ట్, రాయపతి దాత, సామాజిక కార్యకర్తల ప్రసంగాలు విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపాయి. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ గోవర్ధన్ (Goverdhan ) మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
కేఎల్ఆర్ ఇండస్ట్రీస్ యజమాని కె. లక్ష్మీ రెడ్డి ఇగ్నైట్ అండ్ ఇన్స్పైర్ బృందానికి మద్దతు ఇస్తుండడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశ్రమలను సందర్శించడానికి అవకాశాలను కల్పిస్తామని, శిక్షణ, ఇంటర్న్షిప్లను కూడా అందిస్తానని హామీ ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.
గొప్ప వ్యక్తిగా ఎదగడానికి జట్టుకృషి, సేవ, మంచి వ్యక్తిగా సమాజ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ , ప్రొఫెసర్ మురళీదర్శన్, ఏవో రణధీర్ సాగి, అసోసియేట్ డీన్ అకాడమిక్స్ అండ్ ప్లానింగ్ డాక్టర్ చంద్రశేఖర రావు, అసోసియేట్ డీన్లు డాక్టర్ కె. మహేష్, డాక్టర్ విఠల్, వివిధ ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థులు పాల్గొన్నారు.