తానూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వరుడి జాతర సందర్భంగా శనివారం నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. మన జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి పదుల సంఖ్యలో మల్లయోధులు కుస్తీ పోటీల్లో తలపడ్డారు. తిలకించేందుకు తండోప తండలుగా తరలివచ్చిన జనంతో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ కిక్కిరిసింది. నిర్వాహకులు విజేతలకు మొదటి బహుమతి రూ.11,111.. ద్వితీయ బహుమతి రూ.8,851 అందించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ రమేశ్ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సచిన్ పాఠక్, ఆలయ కమిటీ అధ్యక్షుడు పంగి పండరి, మాజీ సర్పంచ్లు తాడేవార్ విఠల్, జాదవ్ మాధవ్ రావుపటేల్, దార్మోడ్ రాములు, సొసైటీ డైరెక్టర్ హున్గుందే పుండ్లిక్, శ్రీసరస్వతీ శిశు మందిర్ అధ్యక్షుడు శివాజీ పటేల్, ఆలయ కమిటీ సభ్యులు నాయకులు బండారే సోమేశ్, దేవిదాస్ పటేల్, విఠల్, గ్రామ పెద్దలు అరుణ్ దేశ్పాండే, గంగాధర్ పాల్గొన్నారు.