ఉట్నూర్, జూలై 20 : రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు సమన్వయంతో సమస్యను ఎదుర్కొందామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలో ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో ఎల్‌నినో సమీక్షపై నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు, తాగునీటి సమస్య, వ్యవసాయ రంగంపై ప్రభావం వంటి అంశాలను అంచనా వేసి శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తే తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసన సభ్యుడు ప్రేమ్‌సాగర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు,ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మంత్రి జూపల్లి గైర్హాజరు
ఉట్నూర్ డివిజన్ కేంద్రంగా సోమవారం ని ర్వహించిన ఎల్‌నినో ప్రభావ తీవ్రత తగ్గిచేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక సమీక్షలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొనాల్సి ఉన్నప్పటికీ చివరి క్షణంలో రాలేదు. దీంతో ప్రత్యేకాధికారిఇల్లంబర్తి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిం చారు. దీంతో సమస్యలను చెప్పుకుందామనుకున్న గిరిజనులు నిరాశకు గురయ్యారు.