నేరడిగొండ, నవంబర్ 2 : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో ఐఏఎస్, ఐఈఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఎస్ఎస్ శిక్షణ అధికారులు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా శిక్షణాధికారులు గ్రామంలో నాలుగు రోజులు పర్యటించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల జీవన విధానం, స్థితిగతుల వంటి అంశాలను పరిశీలించనున్నారు.
ఆదివారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, హరితవనం, నర్సరీ, ప్రభుత్వ పాఠశాల ఆవరణ, మంచినీటి సరఫరా, సీసీరోడ్ల నిర్మాణం, రేషన్ దుకాణం, క్రీడాప్రాంగణాలను పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు. ఇందులో శిక్షణాధికారులు రిషిత కుమారి, మయాంక్ మడ్గిల్, ఆశిష్ భిష్ణోయ్, ఆంత్రమదాన్, ఓం శుక్లా, ఎంపీడీవో శేఖర్, ఆర్ఐ నాగోరావ్, తదితరులు పాల్గొన్నారు.