ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 8 : ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో ఏ ర్పాటు చేసిన హనుమాన్ భారీ విగ్రహాన్ని ఎమ్మె ల్యే జోగు రామన్న గురువారం ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించా రు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని మ తాలను గౌరవిస్తూ ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్నారన్నారు. యాదగిరిగుట్ట రాష్ట్రంలో ప్రసిద్ధి చెం దుతున్నదని, కొండగట్టు వద్ద భారీ హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారని చెప్పారు.
ప్రతిచోటా ఆధ్యాత్మికతను పెంచుతూ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారని, అన్ని మ తాలు, కులాలకు కావాల్సిన మందిరాలతోపాటు గ్రామదేవతల గుడులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి నిర్మిస్తున్నదని పేర్కొన్నారు. దేశంలో హిందూ ధర్మానికి ఉన్న ప్రాచూర్యం విభిన్న సంస్కృతులకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సనాతన హిందూ ధర్మంలో భక్తితో శాంతి స్థాపనను నెలకొల్పారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గండ్రత్ రమేశ్, వైస్ ఎంపీపీ కొమ్ర జంగు, సెవ్వా జగదీశ్, జిట్టా రమేశ్, భూమన్న, గంగయ్య, సాయిగౌడ్, కిరణ్, మెస్రం పరమేశ్వర్, నాగుబాయ్ కిషన్, మెట్టు ప్రహ్లాద్, రమణ పాల్గొన్నారు.
జైనథ్ మండలంలోని బాలాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ గురుదత్త జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పా ల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు డప్పు చప్పుళ్ల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో కమ్యూనిటీ షెడ్‌ను ప్రారంభించారు. త్వరలోనే పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చి ఆదుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, చంద్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.