బోథ్, ఫిబ్రవరి 2 : యువత క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సీఐ ముదావత్ నైలు పేర్కొన్నారు. మండలంలోని బాబెర గ్రామంలో మహాదేవ్ సొసైటీ, మర్లపెల్లి ఉషోదయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నెహ్రూ యువకేంద్రం సౌజన్యంతో బుధవారం నిర్వహించిన వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్లో వాలీబాల్‌తో పాటు కబడ్డీ, ఖోఖో పోటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మర్లపెల్లి, బాబెర సర్పంచ్‌లు కల్లూరి దేవేందర్, సురేశ్, సొసైటీ అధ్యక్షుడు సుదర్శన్, పీఈటీలు సురేశ్, లాడేవార్ రాజు, బీ రమేశ్, జుగదిరావు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
క్రీడలతో స్నేహభావం
బోథ్, ఫిబ్రవరి 2: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎంపీపీ తుల శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని కౌఠ (బీ) గ్రామంలో నిర్వహించిన ఎడ్మాల (ఇట్టెడి) రమణారెడ్డి స్మారకార్థం తాలూకా స్థాయి క్రికెట్ పోటీల్లో గెలుపొందిన జట్లకు బుధవారం ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డితో కలిసి బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో 28 జట్లు పాల్గొనగా అడెగాం, నాగుగూడ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. అడెగామ జట్టుకు రూ 20 వేలు, నాగుగూడ జట్టుకు రూ 10 వేలతో పాటు ట్రోఫీలను అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంకిత్ (కౌఠ (బీ)), మ్యాన్ ఆప్ ది మ్యాచ్ సాయరెడ్డి (అడెగాం) అందుకున్నారు. కార్యక్రమంలో బోథ్ సొసైటీ చైర్మన్ కదం ప్రశాంత్, గంగాధర్, అశోక్‌రెడ్డి, బీ శ్రీధర్‌రెడ్డి, భోజారెడ్డి, లోక శిరీష్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, వినాయక్‌రెడ్డి, రమేశ్, క్రీడాకారులు పాల్గొన్నారు.