ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని భీంపూర్ మండలంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కప్పర్ల క్రాస్‌రోడ్డు, నీపాని, సెంటర్ సాంగి వద్ద వంతెనలు నీట మునిగాయి. దీంతో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.