దండేపల్లి : మండల కేంద్రంలో శుక్రవారం హనుమాన్ దీక్ష స్వాములు హనుమాన్ శోభాయాత్రను (Hanuman Shobhayatra) ఘనంగా నిర్వహించారు. శోభాయాత్ర మ్యాదరిపేట గ్రామం హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమై ముత్యంపేట హనుమాన్ ఆలయం వద్ద ముగిసింది. మండలానికి చెందిన హనుమాన్ దీక్ష స్వాములు భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేశారు.
ముత్యంపేట దుర్గ ఫంక్షన్ హాల్ లో హనుమాన్ చాలీసా ( Hanuman Chalisa) పారాయణం కార్యక్రమం జరిగింది. అనంతరం సామూహిక హనుమాన్ భిక్షను స్వీకరించారు. రఘునాథ్ మాట్లాడుతూ శోభాయాత్రలో హనుమాన్ దీక్ష స్వాములు , భక్తులు పాల్గొని హిందువుల ఐక్యత చాటడం శుభపరిణామమని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క హిందువు తమ వంతు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పత్తిపాక సంతోష్, ఎంబడి సురేందర్, గోపతి రాజయ్య, గాదె శ్రీనివాస్, మోటపలుకుల గురువయ్య, బెడద సురేష్, బత్తుల శేఖర్, బోడకుంటి వెంకటేష్, గాడికొప్పుల సురేందర్, సత్యనారాయణ, ముత్తె అనిల్, ముత్తె వెంకటేష్, నలిమెల మహేష్, తదితరులు పాల్గొన్నారు.