మంచిర్యాల్ అర్బన్ : మంచిర్యాలలో (Mancherial ) పట్టణంలో నానమ్మ (Grandmother) , మనవరాలు ( Grand daughter) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జాల సత్యవతి (54) అనే మహిళకు ఇద్దరు కుమారులు. ఒకరు హిజ్రాగా మారారు. పట్టణంలో గోపాలవాడలో ఇంటి నిర్మించుకుని నివాసముంటు కొంతకాలం క్రితం అతడు మృతి చెందాడు.
అప్పటి నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉండడంతో దానిని అమ్మడానికి తల్లి సత్యవతితో కలిసి కొడుకు గంగోత్రి , మనవరాలు గీతా శిరీష (4) ముగ్గురు కలిసి మూడు రోజుల క్రితం ఖమ్మం నుంచి మంచిర్యాలకు వచ్చారు. రెండు రోజుల క్రితం కొడుకు గంగోత్రికి ఆస్తమా సమస్య రావడంతో తిరిగి ఖమ్మంకు వెళ్లిపోయాడు. ఖమ్మం( Khammam) వెళ్లిన కొడుకు బుధవారం తల్లికి ఫోన్ చేయగా తీయకపోవడంతో ఇంటి పక్కన వారికి సమాచారం అందించి పరిశీలించాలని కోరాడు. లోపలికి తలుపులు గడియ పెట్టి ఉండడంతో, ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న బ్లూ కోల్ట్ సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి తలుపులు బలంగా తీసి చూసేసరికి పడక గదిలో బెడ్ పై నానమ్మ, మనవరాలు మృతదేహాలు పడి ఉన్నాయి. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా ? లేదా హత్యనా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు వారు వచ్చిన తర్వాత మృతదేహాలను స్వాధీన పరచుకొని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు వివరించారు.