ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ( Indravelli ) మండలంలోని సన్షైన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ( Krishna Janmashtami ) అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో అలరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని శ్రీకృష్ణుడి బాల్య లీలలను ప్రదర్శించారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులు విద్యార్థులకు శ్రీకృష్ణాష్టమి విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బి. నర్సయ్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.