తాండూర్ : మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజున జరుపుకునే మిలాద్ ఉన్ నబీ ( Milad-un-Nabi ) ని బుధవారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహించారు. తాండూర్ ( Tandur) జమా మసీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఐబీ మినార్ మసీద్, తంగళ్ళపల్లి మహ్మదీయ మసీద్ వరకు వివిధ వీధుల గుండా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఊరేగింపులో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రవక్త మహ్మద్ భోదించిన శాంతి, సోదరభావం, మానవత్వం, ఐక్యత సందేశాలతో శాంతియుతంగా ర్యాలీ నిర్విహించారు. తాండూర్ సీఐ దేవయ్య ఆధ్వర్యంలో కన్నెపల్లి ఎస్సై విక్రమ్, తాండూర్ ఏఎస్సై రాజమొగిలి, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు.