బజార్హత్నూర్ : బజార్హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామంలో శబరి మాత (Sabari Mata) , శివాలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు మూడురోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్( MLA Anil jadav) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శబరి మాత ఆలయ విగ్రహ ప్రతిష్టాపనకు తన వంతుగా రూ. 40 వేలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. గిర్నూర్ గ్రామంలో అమ్మ వారి భక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారని ఎంత భక్తి ఉంటే మూడు రోజుల నుంచి గ్రామమంత ఒకేచోట చేరి పూజలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
అనంతరం వీర బ్రహ్మేంద్ర స్వామి ( Veerabrahmendra Swamy) వారి కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరై బంగారు తాళి, మెట్టెలు అందజేశారు.ఈ సందర్భంగా పల్లకి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజారామ్, బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులు గజ్జయ్య, చిలుకూరి భూమన్న, సకేష్, రమణ, లక్ష్మన్, అరుణ్, శరత్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.