సీసీసీ నస్పూర్, నవంబర్ 8 : నస్పూర్ పట్టణంలో అనుమతిలేని టేకు దుంగలను ఫారెస్ట్ అధికారులు శనివారం పట్టుకున్నారు. ఊరుశ్రీరాంపూర్లో ఎలాంటి అనుమతులు లేకుండా టేకు కలపతో ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించి కలపతో పాటు ఫర్నిచర్ యాంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కలపతో పాటు ఫర్నిచర్ విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని డిప్యూటీ ఎఫ్ఆర్వో అబ్దుల్ అజాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ స్కాడ్ సెక్షన్ అధికారి రవి, సిబ్బంది పాల్గొన్నారు.
జన్నారం, నవంబర్ 8 : జన్నారం డివిజన్ ఇందన్పల్లి రేంజ్లోని లోతొర్రెలో శనివారం రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణతో పాటు సిబ్బంది దాడులు చేసి తొమ్మిది టేకు దుంగలు పట్టుకున్నారు. కొందరు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అడవుల్లో నుంచి చెట్లు నరికారని, దుంగలు దాచి ఉంచారన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా, రూ. లక్ష విలువైన కలపను పట్టుకొని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు ఆయన తెలిపారు.