నార్నూర్ : సంస్కృతి, సంప్రదాయాలను, భారతీయ విలువలను వివరించేందుకుగాను ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ( Nanoor) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహం (Social welfare Hostels) విద్యార్థులకు వనభోజనం( Vana Bhojanam ) నిర్వహించారు.
మండలంలోని గుండాయి జలపాతం సమీపంలో ఆదివారం వసతిగృహం వార్డెన్ రవి విద్యార్థులకు వన భోజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆట,పాటలతో సరదాగా గడిపారు. అక్కడే వంటకాలు చేసి విద్యార్థులు వన భోజనాలు చేశారు. ఈ సందర్భంగా వార్డెన్ రవి మాట్లాడుతూ విద్యార్థులలో స్నేహభావంతో పాటు సరదాగా గడిపేందుకు వనభోజనం నిర్వహించామని తెలిపారు. ఆటపాటలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు.