ఉట్నూర్ రూరల్ : మండలంలోని లింగోజి తాండ ఎక్స్ రోడ్ గ్రామంలో బుధవారం కూలర్లో (Cooler ) మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాథోడ్ అరుణ ఇంట్లో కూలర్ నడుస్తుండగా ఒక్కసారిగా కూలర్లో మంటలు చెలరేగాయి.
దీంతో గదిలో మంటలు వ్యాపించి అరుణ అనే మహిళకు గాయాలయ్యాయి. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆమె సోదరుడు పృథ్వీరాజ్ గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ హరినాయక్ బాధితులను పరామర్శించారు.