ఇచ్చోడ : మంత్రాలు, తంత్రాలు , తాయత్తులతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ బాబాను అరెస్ట్ ( Fake Baba Arrest ) చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు( CI Raju ) తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కోకస్మన్నూరు గ్రామానికి చెందిన నిందితుడు షేక్ అహ్మద్( Shaik Ahmed ) ప్రజల వద్ద తాయెత్తులు కడుతూ వ్యాధులు రోగాలు నయం చేస్తానంటూ బురిడీ కొట్టిస్తున్నాడన్నారు. ఈ సందర్భంగా ఇచ్చోడ పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.
ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడితే ప్రభుత్వ ,ప్రైవేట్ రంగ వైద్యులను సంప్రదించాలని, బాబాలను కాదని సూచించారు. మంత్ర తంత్రాలతో వ్యాధులు నయం కావనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇలాంటి బాబాలు మరే -ఏ గ్రామంలో అయినా ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిసిన యెడల జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని, వారిపై తగు చర్యలను తీసుకుంటుందని తెలిపారు.