ఉట్నూర్ రూరల్ : ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ ( Judge Ajay Kumar Jadhav ) అన్నారు. సోమవారం మండలంలోని హస్నాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని( Farmation Day ) పురస్కరించుకొని స్వామి వివేకానంద యూత్ (Swami Vivekananda Youth ) సభ్యుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. మొక్కలే మానవాళికి జీవనాధారమని అన్నారు. యువత ముందుంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జైనూర్ మండల ఎంఈవో జాధవ్ మధుకర్, హస్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అజ్మేరా విజయ్, రాథోడ్ మోతీలాల్ నాయక్ ,రాథోడ్ పవార్ తుకారాం, జాదవ్ అజయ్, రాథోడ్ సురేష్ టీచర్, జాదవ్ వసంత్, జాదవ్ సుభాష్, లాకావత్ సుభాష్, రాథోడ్ రామేశ్వర్, రాథోడ్ పరుశురాం, కావాడే విష్ణు పటేల్, ఆత్రం దేవ్, సోను, స్వామి వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు.