ఇంద్రవెల్లి, ఏప్రిల్ 14 : ఉపాధి హామీ కూలీలు ఆన్లైన్ సాంకేతిక సమస్యలతో సతమతం అవుతున్నారు. నూతనంగా ఫేజ్ క్యాప్చరింగ్ విధానం పెట్టడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంద్రవెల్లి మండలంలో నాలుగు వేలకు పైబడి ఉపాధి హామీ కూలీలు రోజు పనులు చేస్తున్నారు. ఇందులో ఒక వెయ్యి మంది కూలీల ఫేస్ క్యాప్చరింగ్ మాత్రమే అవుతుందని కూలీలు తెలిపారు.
గతంలో పది మందితో కూడిన మస్టర్ ఉండేదని, పనులు చేసిన తరువాత కూలీలతో గ్రూప్ ఫొటోను తీసి ఆన్లైన్లో నమోదు చేసే వారని అధికారులు, కూలీలు తెలిపారు. ప్రస్తుం ఒక్కొక్కరికి ఫేస్ క్యాప్చరింగ్‌ను ఆన్లైన్లో నమోదు చేయడంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని కూలీలు వాపోతున్నారు. దీంతో కూలీలతోపాటు అధికారులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసిన కూలీలు తమ హాజరు నమోదు కాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాత పద్ధతిని అమలు చేయాలని అధికారులను విన్నవిస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులను సవరించి పాత పద్ధతినే కొన సాగించాలి. గతంలో పది మం ది కూలీలతో కూడిన మస్టర్ ఉండేదని, పనులు చేసిన తరు వాత కూలీలతో కలిసి గ్రూప్ ఫొటో దిగి ఆన్లైన్లో నమోదు చేసేవారు. కేవైసీ వి ధానంతో ఒక్క కూలీ ఫేస్‌ను క్యాప్చరింగ్ చేయడా నికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతున్న ది. 40 మంది కూలీలు కలిసి పనులు చేస్తే 16 మం ది ఆన్లైన్లో హాజరు నమోదు అయింది. దీంతో ఉపాధి హామీ కూలీలకు తీవ్రంగా నష్టం జరుగు తున్నది. ఇలానే సమస్యలు ఉంటే మేం పనులు చేయలేం.
– విజయమాల, ఉపాధి హామీ కూలీ.