కాసిపేట, సెప్టెంబర్ 14 : ఓటరు జాబితా సర్వేపై బీఎల్వోలు నిర్లక్ష్యం చేయవద్దని, గడువులోగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివా రం దేవాపూర్‌లో నిర్వహిస్తున్న ఇంటింటి ఓటరు జాబితా సమగ్ర సర్వేను పరిశీలించారు. ఇంటింటి సర్వే ఆలస్యంగా కొనసాగుతుండగా, బీఎల్వోలను మందలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అ నంతరం దేవాపూర్ గ్రామ పంచాయతీలో గ్యాస్ సబ్సిడీ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భోజన్న, కార్యదర్శి కవిత పాల్గొన్నారు.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 14 : పట్టణంలోని ప లు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ దీపక్ కు మార్ సందర్శించారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తున్న ఇంటింటి ఓటరు జాబితా సమగ్ర సర్వేను స్వయంగా పర్యవేక్షించారు. బూత్ నం.86, యువ సంఘటన్ పాఠశాలలో జ రుగుతున్న ఓటర్ జాబితా సర్వే గురించి అంగన్వాడీ టీచర్, బూత్ లెవెల్ ఆఫీసర్ స్వరూపను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓటర్ జాబితాలో ఎంత మంది ఓట ర్లు ఉన్నారు, ఇప్పటి వరకు ఎంతమంది ఇళ్లలో సర్వే పూర్తి చేశారు అని ప్రశ్నించారు.