ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చైనా, తదితర దేశాల్లో కరోనా ఉధృతి తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ సూచించారు.
- ఆదిలాబాద్ డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్
ఎదులాపురం, డిసెంబర్ 24 : చైనా, తదితర దేశాల్లో కరోనా ఉధృతి తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ సూచించారు. శనివారం ఆదిలాబాద్‌లో డీఎంహెచ్‌వో కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా కొత్త వేరియంట్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తిరిగి అలజడి సృషిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్త చర్యలు పాటించాలని పేర్కొన్నారు.
జిల్లాలో ప్రస్తుతానికి కరోనా తీవ్రత అంతగా లేదని, అయినప్పటికీ ప్రజలు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం కాగా బూస్టర్ డోస్ 85 శాతం అయిందన్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని పీహెచ్సీ, సీహెచ్‌సీ, రిమ్స్‌లో పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకోవాలని సూ చించారు. ఇప్పటికీ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల వైద్యులతో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశామన్నారు. అలాగే రిమ్స్‌లో 500 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వైసీ శ్రీనివాస్, ఎన్సీడీ ప్రోగ్రాం ఆణీసర్ క్రాంతికుమార్, మెడికల్ ఆఫీసర్ అశోక్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

