బాసర, అక్టోబరు 19 : అమ్మవారి నవరాత్రోత్సవాల సందర్భంగా ఐదో రోజు గురువారం అమ్మవారు స్కంధమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు తమ పిల్లలకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తదితర రాష్ర్టాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వచ్చారు.
గంటల పాటు క్యూలో వేచి ఉంటున్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల తమ పిల్లలకు ఇబ్బంది కాకుండా పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం మూల నక్షత్రం కావడంతో బాసరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దీని కోసం అధికారులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు చేశారు.
‘అగ్నిపథ్’ కు నిఖిత ఎంపిక గర్వకారణం
ఎదులాపురం,అక్టోబర్19: రాష్ట్రం నుంచి అగ్నిపథ్ దళానికి జిల్లాకు చెందిన పోతివాల్ నిఖిత ఎంపికవడం ఆదిలాబాద్‌కు గర్వకారణమ ని జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గురువారం నిఖితకు పుష్పగుచ్ఛం అందజే సి శాలువాతో సత్కరించారు.
అన్ని రంగాల్లో యు వత రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వీ ఉమేందర్, జిల్లా యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు బాల శంకర్ కృష్ణ, నిఖితా సింగ్ కోచ్ లక్ష్మణ్ సింగ్, రాణా ప్రతాప్ సింగ్, పసుపులరాజు ఉన్నారు.