తాండూర్ : విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు( Teachers ) అంకితభావంతో పనిచేయాలని జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య ( DEO Yadayya) సూచించారు. గురువారం తంగళ్లపల్లి స్కూల్ కాంప్లెక్స్ సమావేశం, మండల కేంద్రంలోని కేజీబీవీ (KGBV) పాఠశాలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ లో అమలవుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్‌ను పరిశీలించారు. ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ అభ్యాసం, హాజరు శాతం, విద్యా ప్రమాణాల పెంపు వంటి విషయాల్లో చూపుతున్న పట్టుదల ఆదర్శంగా ఉందని కొనియాడారు.
అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యా స్థాయిని పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిరుచులు, డిజిటల్ కంటెంట్ వినియోగంపై ఆరా తీశారు. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. ఆహార నాణ్యత, శుభ్రతను, వంటగది, ఆహార సరఫరా ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ అంజయ్య, ఎంఈవో ఎస్ మల్లేశం, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దుర్గం శ్రీనివాస్, ఉమాదేవి, కేజీబీవీ ఎస్వో కవిత, రిసోర్స్‌పర్సన్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.