సీసీసీ నస్పూర్/మందమర్రి, సెప్టెంబర్ 24 : సింగరేణి సంస్థలో నికర లాభాలపై 33 శాతం వాటా చెల్లిం చాల్సిందేనని, లేదంటే పోరాటం తప్పదని టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్, బీఆ ర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం నస్పూర్కాలనీలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులతో కలిసి రాస్తారోకో చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వారు మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన రూ.2222 కోట్ల లాభాల నుంచి అప్పటి సీఎం కేసీఆర్ 32 శాతం వాటా ప్రకటించి, దాదాపు రూ. 710 కోట్లు అందించారని గుర్తు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి రూ.4701 కోట్ల లాభాలు వచ్చినట్లు యాజమాన్యం ప్రకటించిందని, ఇందులో కార్మికులకు 33 శాతం వాటా చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. లాభాల వాటా విషయంలో సింగరేణి కార్మికులకు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, సీఎం కేసీఆర్ ఉంటే తమకు ఎక్కువ శాతం లాభాల వాటా వచ్చేదని గుర్తుచేసుకుంటున్నారని పేర్కొన్నారు.
కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి పెద్ద మొత్తంలో లాభాలు తీసుకువస్తే చివరికి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. 33 శాతం వాటాను పంచేదాకా దశల వారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సింగరేణి ఏరియాల్లో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కార్మికులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారికి తీరని అన్యాయం చేశారని, వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, నాయకులు గోపియా నాయక్, సాదుల భాస్కర్, గడ్డం సుధాకర్, జాడి భానుచందర్, బండారు తిరుపతి, తిరుమల్‌రావు, అడ్లకొంద రవిగౌడ్, కుర్మిళ్ల మోహన్, కురుమ వికాస్, బిరుదు శ్రీనివాస్, దుర్గం రవి, బత్తుల రాజేశం, మారం శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, సల్మాన్, తిరుపతిరెడ్డి, నరేశ్, చిప్ప రమేశ్, కిషోర్, రాజేందర్ పాల్గొన్నారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
మందమర్రి మారెట్ చౌరస్తాలో మంగళవారం టీబీజీకేఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాల నుంచి 33 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈఅ విషయంలో కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, సింగరేణిని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు రవీందర్, కేంద్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, పిట్ కార్యదర్శులు,నాయకులు పాల్గొన్నారు.