Adilabad | పాత మొబైల్స్ ఇచ్చి.. ప్లాస్టిక్ వస్తువులు తీసుకెళ్లండి.. సైబర్ నేరగాళ్ల నయా ప్లాన్ బట్టబయలు.. ఆరుగురు అరెస్టు
Adilabad | మీ ఇంట్లో పనికిరాని పాత మొబైల్‌ను ఇస్తే ప్లాస్టిక్ వస్తువులు ఇస్తామని మీ ఊళ్లో తిరుగుతున్నారా? ప్లాస్టిక్ వస్తువులకు ఆశపడితే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఇలాగే ఆటోలో వీధి వీధి తిరుగుతూ పాత మొబైల్స్‌ను సేకరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రట్టయ్యింది
Adilabad | ఆదిలాబాద్ : మీ ఇంట్లో పనికిరాని పాత మొబైల్‌ను ఇస్తే ప్లాస్టిక్ వస్తువులు ఇస్తామని మీ ఊళ్లో తిరుగుతున్నారా? ప్లాస్టిక్ వస్తువులకు ఆశపడితే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఇలాగే ఆటోలో వీధి వీధి తిరుగుతూ పాత మొబైల్స్‌ను సేకరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రట్టయ్యింది. ఆరుగురు నిందితులతో కూడిన బిహార్ ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు తెలిపారు.
పాత, పనికిరాని మొబైల్స్‌ను ఇస్తే ప్లాస్టిక్ వస్తువులను ఇస్తామని బిహార్‌కు చెందిన ముఠా సభ్యులు గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతారు.ఊరూరు తిరిగి పాత ఫోన్లను సేకరిస్తారు. అనంతరం ఫేక్ ఐడీ కార్డులతో తీసుకున్న సిమ్ కార్డులను అందులో వేసి, వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. ఆ ఫోన్ నంబర్లతో అమాయక ప్రజలకు ఫోన్ చేసి, బ్యాంకు అధికారులమని నమ్మించి డబ్బులు కాజేస్తుంటారు. ఈ ముఠా గురించి తెలుసుకున్న ఆదిలాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసకున్నారు.
ఆరుగురు ముఠా సభ్యలను అరెస్టు చేసి, వారి దగ్గర నుంచి 2015 పాత మొబైల్స్, 105 సిమ్ కార్డులు, 5 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని సభ్యులు ఇప్పటికే రాష్ట్రంలోని 12 వేల మొబైల్స్‌ను సేకరించి, వివిధ సైబర్ నేరాలకు పాల్పడినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

