గర్మిళ్ల, జనవరి 1 : రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ రెమా రాజేశ్వరి అధికారులతో కలిసి సోమవారం న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది పోలీస్‌శాఖలో అధునాతన సాంకేతికతను తీసుకురావడం వల్ల సిబ్బందికి ఎంతో దోహదపడిందన్నారు.
ఈ కొత్త సంవత్సరంలో నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంపై ఆమె అధికారులను అభినందించారు. క్యాష్ రివార్డులు అందించారు. అలాగే రాబోయే ఎన్నికలకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు.