మంచిర్యాల అర్బన్, జూలై 19 : గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే పీడీయాక్ట్ తప్పదని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక డీసీపీ కార్యాలయంలో గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితులకు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ నేర ప్రవృత్తిని మార్చుకోకుంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. మంచిర్యాల జోన్ పరిధిలో గంజాయి రవాణా, అమ్మకాలు జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఏసీపీలు ఆర్.ప్రకాశ్, రవికుమార్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
మందమర్రిలో గంజాయి తాగుతూ పట్టుబడ్డ నలుగురు యువకులకు, వారి కుటుంబ స భ్యుల సమక్షంలో డీసీపీ ఏ.భాస్కర్ కౌన్సెలిం గ్ నిర్వహించారు. ఇందులో ఒకరు ఐటీఐ పూర్తి చేయగా, మరొకరు ఐటీఐ చదువుతున్నాడు. మిగతా ఇద్దరు యువకులు పెయింటింగ్ చేస్తూ జీవినం సాగిస్తున్నారు. గంజా యి విక్రయించినా, రవాణా చేసినా 87126 71111, టోల్ ఫ్రీ టీజీఏఎన్బీ 14446 నంబర్లకు సమాచారం అందించాలన్నారు.