ఇచ్చోడ : ఎన్నికల సమయంలో తులం బంగారం (Tulam gold ) పేరుతో కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 69 మంది లబ్దిదారులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రూ. లక్షా 116 చొప్పున కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అద్భుతమై కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చాలేదన్నారు. కల్యాణ లక్ష్మి లబ్దిదారులకు నిరాశే మిగిలిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులు సుభాష్, కార్యకర్తలు పాల్గొన్నారు.