కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్‌లో కాంగ్రెస్ దిష్టి బొమ్మను (Congress effigy) బీజేపీ నాయకులు దహనం చేశారు. కాంగ్రెస్ నాయకుల ( Congress ) అరాచకం వల్ల వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్య ( Suicide ) చేసుకోవడంపై నిరసన చేపట్టారు. బీజేపీ కాసిపేట మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
కాంగ్రెస్ నాయకుల అక్రమ కేసులు, వేధింపుల వల్ల ఆత్మహత్య అటవి ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకున్న ఘటన బీజేపీ నాయకుల మనసులను కలచివేసిందని పేర్కొన్నారు. ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెస్ నాయకులపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దేవనూరి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు దోమల రామచందర్, కార్యదర్శి మెస్రం తిరుపతి, చొప్పదండి విష్ణువర్ధన్, గుంపుల సదయ్య, ముత్యాల నవీన్ కుమార్, సీనియర్ నాయకులు నైతాం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.