ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూలై 28 : ఈ నెలాఖరుకల్లా 53 లక్షల మొకలు నాటి వన మహోత్సవం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పీటీజీ కళాశాలలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టి బ్రేవాల్ అధ్యక్షతన నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, డీటీడీవో రమాదేవి, మున్సిపల్ కమిషనర్ భుజంగరావుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. వారితో కలిసి మొక్కలు నాటారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 50 శాతానికి పైగా మొకలు నాటినట్లు తెలిపారు. రోడ్లకు ఇరువైపులా, అన్ని కార్యాలయాల్లో మొకలు నాటేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కనూ బతికేలా చూ డాలన్నారు. ప్రతి ఇంటికి 6 మొకలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒకరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకొండ, డిప్యూటీ రేంజ్ అధికారి యోగేశ్, స్థానిక సీఐ సతీశ్, జీసీడీవో శకుంతల, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.