నస్పూర్, డిసెంబర్ 20 : జిల్లాలో చేపట్టే అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యంతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ మురుగు కాలువలు, అంతర్గత రహదారులు, కల్వర్టులు, ప్రహరీ, గ్రేవల్ రోడ్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా గుత్తేదారులతో సమీక్షించాలన్నారు. ఈ నెల 31లోగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ ఈఈ స్వామిరెడ్డి పాల్గొన్నారు.