రెబ్బెన, జనవరి 10: మండలంలోని గంగాపూర్ శివారులో కొలువైన శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతరకు పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులకు సూచించా రు. మండల కేంద్రంలోని గంగాపూర్ ఆర్చ్ ప్రాంతం, గంగాపూర్ గేట్ రోడ్, ప్రత్యామ్నా య మార్గాలను పరిశీలించారు. వాహనాల రాకపోకలకు సంబంధించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూ చించారు. డీసీసీ అధ్యక్షుడువిశ్వప్రసాద్రావు, రెబ్బెన జడ్పీటీసీ వేముర్ల సంతోష్, ఎంపీడీవో పరికిపండ్ల శ్రీనివాస్, తహసీల్దార్ సమీర్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు లావుడ్య రమేశ్, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు దుర్గం దేవా జీ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్‌గౌడ్, నాయకులు నవీన్జైస్వాల్, మోడెం రాజాగౌడ్, జుమ్మిడి ఆనందరావు, వెంకటేశ్వర్‌గౌడ్, ఉమేశ్, శ్రీనివాస్ ఉన్నారు.